Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:14 AM

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.

07-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న విమర్శించారు. తొలి దశ, మలి దశ ఉద్యమకారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఉద్యమకారుల అంశం శాసనసభ, శాసన మండలిలో చర్చకు వచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ నెలాఖరు వరకు సబ్ కమిటీని ప్రకటించి ఉద్యమకారులను గుర్తించకపోతే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 33 జిల్లాల్లో మండల కేంద్రాల వద్ద నిరసనలు, రాస్తారోకోలు, హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఉద్యమాలు చేయడం ఉద్యమకారులకు కొత్త కాదని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జోగు అంజన్న డిమాండ్ చేశారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తించాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News