Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య

07-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా : జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల భాష సరిగా లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై కూడా ఆయన స్పందిస్తూ, హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. భూ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాలు, బెదిరింపుల అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

Sthanikam

కాంగ్రెస్ నాయకుల భాష దారుణం : చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News