సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హుల్గెరా గ్రామంలో సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహానికి గ్రామ పెద్దలు, యువకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ బసవేశ్వరుడు బోధించిన సమసమాజ స్థాపన, కాయక సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలన్న ఆయన బోధనలు నేటికీ అనుసరించాల్సినవని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లింగాయత్ సంఘం సభ్యులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
PRINT TIME: September 22, 2026 01:00 AM
భక్తిశ్రద్ధలతో హుల్గెరాలో బసవేశ్వర జయంతి వేడుకలు

20-04-2026
79 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హుల్గెరా గ్రామంలో సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహానికి గ్రామ పెద్దలు, యువకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ బసవేశ్వరుడు బోధించిన సమసమాజ స్థాపన, కాయక సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలన్న ఆయన బోధనలు నేటికీ అనుసరించాల్సినవని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లింగాయత్ సంఘం సభ్యులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి