Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:26 AM

దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు

14-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట:

దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కొండపై దుకాణాల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక భక్తుడు అన్నల్దాస్ వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం, పూజలు, ప్రసాదాల టికెట్ల ధరల పెంపుపై అధికారులు చూపుతున్న శ్రద్ధ, దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కొండపై సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యాపారులు కొత్తవారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.

దేవస్థాన దుకాణాలను ఇతరులకు అప్పగిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని, లీజులు–సబ్‌లీజుల ద్వారా దేవస్థానానికి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇతర టెండర్లలో సరైన ధర రాకపోతే రద్దు చేసే అధికారులు, దుకాణాల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కొండపై ఉన్న దుకాణాలను రద్దు చేసి పారదర్శకంగా కొత్త టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

దేవస్థాన దుకాణాలపై ఎందుకు చర్యలు లేవు.? అధికారులను ప్రశ్నించిన స్థానిక భక్తుడు

Article Image

యాదగిరిగుట్ట:

దేవస్థానానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కొండపై దుకాణాల వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక భక్తుడు అన్నల్దాస్ వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం, పూజలు, ప్రసాదాల టికెట్ల ధరల పెంపుపై అధికారులు చూపుతున్న శ్రద్ధ, దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్న వ్యాపారులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కొండపై సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యాపారులు కొత్తవారికి, స్థానిక నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.

దేవస్థాన దుకాణాలను ఇతరులకు అప్పగిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని, లీజులు–సబ్‌లీజుల ద్వారా దేవస్థానానికి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇతర టెండర్లలో సరైన ధర రాకపోతే రద్దు చేసే అధికారులు, దుకాణాల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కొండపై ఉన్న దుకాణాలను రద్దు చేసి పారదర్శకంగా కొత్త టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News