Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్

11-02-2026 193 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకుడు మేకల సురేష్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకులు మేకల సురేష్ కార్మికులకు పిలుపునిచ్చారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం–2025, వీబీజీఆర్‌ఏఎం చట్ట సవరణ బిల్లుల ద్వారా విద్యుత్ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుల ద్వారా ఎల్‌బీపీలలో 100 శాతం విదేశీ పెట్టుబడిదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది ప్రజా రంగ సంస్థల నిర్వీర్యానికి దారి తీస్తుందన్నారు.కార్మికుల ఉపాధి భద్రత, ప్రజలపై భారం పెంచే ఈ విధానాలను తిప్పికొట్టాలంటే సమిష్టి పోరాటమే మార్గమని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు అందరూ ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలని మేకల సురేష్ పిలుపునిచ్చారు.

Sthanikam

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. సురేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News