Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:08 PM

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వెలిమినేడు గ్రామీణ బంద్

12-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం

చిట్యాల మండలం, వెలిమినేడు,

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గ్రామీణ బంద్ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పని జరుగుతున్న ప్రదేశాల్లో పనులను నిలిపివేసి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లం మహేష్, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు అరూరి శ్రీను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పథకానికి పేరు మార్పు చేయడం, నిధుల భారం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం ద్వారా భవిష్యత్తులో నిధుల కేటాయింపును తగ్గించి పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.

గతంలో మాదిరిగానే ఉపాధి హామీ పథకానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేకంగా భావిస్తున్న నాలుగు లేబర్ కోడ్లు, జాతీయ విత్తన చట్టాలు, విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని కోరారు. రైతాంగ, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం విరమించుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, పంది నరేష్, దేశగోని నరసింహ, సురకంటి మోహన్ రెడ్డి, అరూరి శంబయ్య, ఆడెపు రమేష్, బొడ్డుపల్లి శ్రీను, అరూరి దుర్గయ్య, చిరగోని లింగయ్య, కందటి యాదిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వెలిమినేడు గ్రామీణ బంద్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News