Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు

19-02-2026 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎల్లగిరి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా, కుమారుడు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కోటి చుక్కల అశోక్ (20), నివాసం మియాపూర్, స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, తన తండ్రి కోటి చుక్కల సుబ్రహ్మణ్యం (48)తో కలిసి స్కూటీ నంబర్ TS07AK2087పై చోడవరం నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు.మార్గమధ్యలో ఎల్లగిరి గ్రామ శివారులోని పేదరాశి పెద్దమ్మ హోటల్ సమీపంలో వెనుక నుండి వస్తున్న గుర్తు తెలియని డీసీఎం వాహనం డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి స్కూటీని ఢీకొట్టాడు. ఢీకొన్న ప్రభావంతో తండ్రీకొడుకులు ఇద్దరూ కిందపడిపోయారు. డీసీఎం వాహనం వెనుక ఎడమ టైరు సుబ్రహ్మణ్యం తలపై నుంచి వెళ్లడంతో ఆయనకు తీవ్ర రక్త గాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్‌కు కుడి కాలి పాదానికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.

Sthanikam

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి – కుమారుడికి గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News