Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:22 AM

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు

16-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. జిల్లా కీటక జనిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్. వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ పాండు నాయక్ మాట్లాడుతూ ఎడిస్ దోమ కాటు వల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్లెట్లు తగ్గి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

డాక్టర్ ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది డెంగ్యూ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని వెల్లడించారు.

కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్, డాక్టర్ వీణ, డాక్టర్ స్వరాజ్ లక్ష్మి, డాక్టర్ విజయ్ పాటిల్, దీనరాణి, మలేరియా అధికారి నరసయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, సీహెచ్‌వో జ్ఞానేశ్వర్, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు

Sthanikam

డెంగ్యూపై అవగాహన అవసరం. జిల్లా ఆస్పత్రిలో ర్యాలీ, సదస్సు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News