Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:44 AM

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు

11-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

వడ్డెర జాతికి రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కల్పించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దండగల మారెప్ప, ప్రధాన కార్యదర్శి గోగుల చక్రపాణి ఆంధ్రప్రదేశ్ బీసీ గ్రామీణ, పట్టణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ విశ్వ ఐఏఎస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రంలో వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చడంతో పాటు, వడ్డెర, వడ్డీలు, వడ్డీ తదితర ఉపవర్గాలన్నింటినీ ఒకే జాతిగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పేర్లు భిన్నంగా ఉన్నప్పటికీ, వీరందరూ ఒకే వడ్డెర సమాజానికి చెందిన వారేనని వివరించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో వడ్డెర జాతికి చెందిన వారు ఎస్.సి లేదా ఎస్.టి వర్గాల్లో కొనసాగుతూ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వడ్డెరలు బీసీ వర్గంలోనే కొనసాగుతూ ఇంకా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ వడ్డెర సమాజం రాళ్ల పనులు, కూలీ పనులు, భూమి తవ్వకాల వంటి కఠిన శ్రమ ఆధారిత వృత్తులపైనే ఆధారపడి జీవిస్తోందని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వడ్డెర జాతిని ఎస్.టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా వడ్డెర సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అభివృద్ధి పథకాలు అమలు చేయాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించిన వడ్డెర్ల సంక్షేమ సంఘం నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News