Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:21 PM

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక
10-03-2026 237 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెళ్తే 3 నెలల జైలు, రూ.5 వేల జరిమానా: ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో జరిగే వివాహాలు, దావత్‌లు, ఇతర వేడుకలకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి భోజనం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాయి.

ఇటీవల పలు ఫంక్షన్ హాల్స్ వద్ద “సంబంధం లేని వ్యక్తులు దావత్‌లకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా బోర్డులు ఏర్పాటు చేశారు.

వేడుకలకు సంబంధం లేకుండా వచ్చి భోజనం చేయడం వల్ల నిర్వాహకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే ఆహార వృథా, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు హెచ్చరికగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ బోర్డులు చూసిన స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఈ విషయం వార్తల్లో రావడంతో మరిన్ని ఫంక్షన్ హాల్స్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Sthanikam

దావత్‌లకు సంబంధం లేని వారికి హెచ్చరిక

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News