Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:13 AM

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం

దాతల సహకారం అభినందనీయం
19-02-2026 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రభుత్వ పాఠశాలలో నూతన మరుగుదొడ్ల ప్రారంభం – విద్యాభివృద్ధికి తోడ్పాటు

సూర్యాపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు సహకరించిన దాతలు మేడిగ ఈశ్వర్ కుమార్, శైలజల సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన నూతన మరుగుదొడ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించడం ప్రశంసనీయమన్నారు. త్రి శక్తి వనిత సమూహం ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి విద్యాభివృద్ధికి తోడ్పడటం సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు.విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, దాతలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజా, రవిబాబు, గుండా రమేష్, రాచకొండ శ్రీనివాస్, తేలుకుంట్ల వెంకన్న, రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు, త్రి శక్తి వనిత సమూహం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దాతల సహకారం అభినందనీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News