Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:28 AM

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దు

22-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధింపు: జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ప్రజల రవాణా అవసరాల కోసం ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించిన రోడ్లపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు వెళ్లడం వల్ల రహదారులు ధ్వంసం అవుతున్నాయని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ఈ విషయమై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావడం, రోడ్లను తవ్వి వదిలేయడం వంటి చర్యల వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా ఘటనలు ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని అన్నారు. వ్యవసాయ పనులు లేదా ఇతర అవసరాల దృష్ట్యా ఎవరైనా రోడ్లను తవ్వాల్సి వచ్చినప్పుడు, సంబంధిత శాఖ అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే రహదారులు తీవ్రంగా నష్టపోతాయని, ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రైతులు, ట్రాక్టర్ యజమానులు ఈ విషయాన్ని గమనించి దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను రోడ్లపైకి తీసుకురావద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావద్దు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News