Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి

01-06-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకడబూర్ మండలం బస్సులదొడ్డి గ్రామంలో దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌ను వెంటనే రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఎంఆర్‌పీఎస్ నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కర్నూలులోని సునయనా ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ.. బస్సులదొడ్డి గ్రామ సర్వే నంబర్‌ 89లోని 4.19 ఎకరాల భూమిని సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం దళితులకు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసి కేటాయించిందన్నారు. అయితే ఆ భూమిలో 1.63 ఎకరాలను గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో డీఆర్ లంకరెడ్డి అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేర్లపై నమోదు చేయించి వెంచర్‌ ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార బలంతో రికార్డుల్లో మార్పులు చేసి, గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అక్రమ వెంచర్‌ను రద్దు చేసి, దళితులకు కేటాయించిన 1.63 ఎకరాల భూమిపై పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్‌పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, మండల అధ్యక్షుడు మంచోది ఆదాము మాదిగ, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, బాధితులు రాజశేఖర్, నరసింహులు, రామాంజి, ఆదాము, ఈరన్న, ప్రకాశం, ఆంజినేయులు, మరిదాసు, తిరుమల, దేవపుత్ర, యోహాను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళితుల ఇళ్ల స్థలాలపై అక్రమ వెంచర్‌ రద్దు చేయాలి. కలెక్టర్‌కు జై భీమ్‌ ఎంఆర్‌పీఎస్ వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News