Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:42 AM

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

12-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య డిమాండ్

మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ 7వ వార్డులో మొండి కత్తి జానకమ్మపై జరిగిన దాడి ఘటన బాధాకరమని, హేయనీయమని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నల్లగొండ జిల్లా సహ సమన్వయకర్త వజ్జగిరి అంజయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.సామాజికంగా ఎదుగుదలను ఓర్చుకోలేక మాదిగ కులస్తురాలైన జానకమ్మపై కుట్రపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని ఆరోపించారు. దాడికి పాల్పడిన స్వప్న రెడ్డి, కొత్త శ్రీనుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కోరారు.పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు నీలకంఠం నాయక్, ధర్మ సమాజ్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు తరి ఎల్లయ్య, జిల్లా నాయకుడు వెంకటేష్, మండల కార్యదర్శులు లక్ష్మణ్, హరికృష్ణ, సైదులు, శ్రీనివాస్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News