Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:28 PM

దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం అవసరం. ఈనెల 13న నల్లగొండ సభను విజయవంతం చేయాలి: టీఎస్ క్రిస్టఫర్

01-06-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను రద్దు చేయాలనే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, వారి రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం క్రైస్తవ సమాజం ఐక్యంగా ఉద్యమించాలని టీఎస్ క్రిస్టఫర్ పిలుపునిచ్చారు.

ఈనెల 13న నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం పట్టణంలోని సువార్త నిలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏఐసీఎఫ్ నల్లగొండ కో-ఆర్డినేటర్ డేవిడ్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా నల్లగొండ పాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధులు, రోమన్ క్యాథలిక్ పాదర్లు, క్రైస్తవ సంఘాల పెద్దలు, ఉద్యోగులు, విశ్వాసులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీఎస్ క్రిస్టఫర్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాను రద్దు చేసే ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. దళిత క్రైస్తవులకు న్యాయమైన హక్కులు, ఎస్సీ హోదా కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రోమన్ క్యాథలిక్ శౌరయ్య, సీబీసీ జేమ్స్, పాస్టర్లు ప్రవీణ్, సమర్పణ కుమార్, మోసెస్, జాకబ్, ఫాదర్ జీవన్ కుమార్, చింత సుధాకర్, శ్రీను, యాకోబు, ప్రభుదాసు, రిటైర్డ్ హెచ్‌ఎం కొంపల్లి భక్షపతి, రిటైర్డ్ ఎస్‌సీఈ చిట్యాల పాల్ రాజు, మాచర్ల గిరి ప్రకాశ్, మాగి జోసెఫ్, మేడి లక్ష్మయ్య, సంజీవయ్య, దుబ్బ ప్రేమ్ కుమార్, ఆనందమయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం అవసరం. ఈనెల 13న నల్లగొండ సభను విజయవంతం చేయాలి: టీఎస్ క్రిస్టఫర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News