Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:21 AM

డాలర్ కు రూపాయికి జరిగిన యుద్ధంలో రూపాయి గెలిచింది

14-02-2026 370 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీ 16వ వార్డులో సిపిఎం కౌన్సిలర్ బత్తుల జయమ్మ-దాసు సంచలన విజయం

ప్రజల మనిషి రాజన్న కోటకు బీటలు.

కూలిన వెన్ రెడ్డి రాజు సామ్రాజ్యం.

సామాన్యుడి చేతిలో సంపన్నుడి ఓటమి.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చౌటుప్పల్ మున్సిపాలిటీ 16వ వార్డులో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మున్సిపల్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ల అధ్యక్షుడు వెన్ రెడ్డి రాజు సతీమణి వెన్ రెడ్డి సంధ్య పై సిపిఎం నుంచి పోటీ చేసిన సామాన్య కార్యకర్త బత్తుల జయమ్మ-దాసు సంచలన విజయం సాధించారు.411 ఓట్ల మెజార్టీతో గొప్ప విజయాన్ని వార్డు ప్రజలు ఆమెకు అందించారు.కోట్ల రూపాయలు, విచ్చలవిడిగా మద్యం పంపిణీ జరిగినప్పటికీ వాటిని లెక్కచేయకుండా సామాన్య సిపిఎం పార్టీ నాయకురాలిని గెలిపించారు. ఓటుకు-నోటుకు జరిగిన ఈ యుద్ధంలో ఓటే గెలిచింది.250 కోట్ల రూపాయలతో చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేశానని ప్రగల్బాలు పలికి, అసత్యాలు ప్రచారం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ను ప్రజలు నమ్మకుండా కోటిశ్వరుని లెక్కచేయకుండా పేదవాడి వైపు ప్రజల మొగ్గు చూపారు.డాలర్ కు రూపాయికి జరిగిన యుద్ధంలో రూపాయి గెలిచింది.స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడుగా భావించే రాజు ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు సమాధానం లాంటిది.స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా మేల్కొని స్థానికంగా ఏం జరుగుతుందో గమనించాలని ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.కొంతమంది భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నాడని వాటిని మానుకోవాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నారు. గెలిచిన వారు భూ కబ్జాల వైపు వెళ్లకుండా గెలిపించిన వార్డు ప్రజలకు 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.ముఖ్యంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండు,చౌటుప్పల్ ఊర చెరువు భూములు కబ్జాలకు గురికాకుండా ప్రజలు,మేధావులు జాగ్రత్త వ్యవహరించాలని చర్చించుకుంటున్నారు.

Sthanikam

డాలర్ కు రూపాయికి జరిగిన యుద్ధంలో రూపాయి గెలిచింది

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News