Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:38 AM

దక్షిణ వైసీపీలో చేరిన 33 వ వార్డు జనసేన వీర మహిళ, కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి.

24-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విశాఖపట్నం. 33వ వార్డుకు చెందిన జనసేన వీర మహిళ వాడపర్తి కనక రత్నం దక్షిణ వైయస్ఆర్సీపీలోకి చేరారు. సోమవారం డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో ఆమె వైసిపి కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మళ్లీ రావాలని కోరుకుంటూ వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న నిర్విరామ సేవలు, దక్షిణ నియోజకవర్గంలో అందించిన అభివృద్ధి, కార్యకర్తల అభివృద్ధికి, ప్రజా సేవకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎటువంటి ఎన్నికలైనా ఎగిరేది వైసిపి జెండా అని, ప్రజల కోరుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ తుంగలో తొక్కారన్నారు. విద్యా , వైద్యం, ఉపాధి అందించడంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో 33 వ వార్డు అధ్యక్షులు ముత్తా బత్తుల రమేష్, సౌత్ పరిశీలకులు వీసాల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము మరియు జిల్లా నాయకులు స్టేట్ నాయకులు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దక్షిణ వైసీపీలో చేరిన 33 వ వార్డు జనసేన వీర మహిళ, కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి.

Article Image

విశాఖపట్నం. 33వ వార్డుకు చెందిన జనసేన వీర మహిళ వాడపర్తి కనక రత్నం దక్షిణ వైయస్ఆర్సీపీలోకి చేరారు. సోమవారం డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో ఆమె వైసిపి కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మళ్లీ రావాలని కోరుకుంటూ వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న నిర్విరామ సేవలు, దక్షిణ నియోజకవర్గంలో అందించిన అభివృద్ధి, కార్యకర్తల అభివృద్ధికి, ప్రజా సేవకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎటువంటి ఎన్నికలైనా ఎగిరేది వైసిపి జెండా అని, ప్రజల కోరుకున్న విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ తుంగలో తొక్కారన్నారు. విద్యా , వైద్యం, ఉపాధి అందించడంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో 33 వ వార్డు అధ్యక్షులు ముత్తా బత్తుల రమేష్, సౌత్ పరిశీలకులు వీసాల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము మరియు జిల్లా నాయకులు స్టేట్ నాయకులు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News