Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

27-12-2025 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా సమావేశం – సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

నల్గొండ – స్థానిక ప్రతినిధి

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక ఎర్రయ్య స్మారక హాల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగ్య గోప సముద్రం తండా సర్పంచ్‌గా గెలిచిన సరస్వతి రవి నాయక్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ… యువజన, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ధన బలం ముందు ప్రజా బలంతో గెలుపొందిన డివైఎఫ్ఐ నాయకులు అభినందనీయులని అన్నారు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. యువకులను ఆదరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, నాయకులు ఖమ్మంపాటి అంజి, ఆదిల్, బాలరాజు, తరుణ్, లింగస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగింది.

Sthanikam

డివైఎఫ్ఐ జిల్లా సమావేశంలో సరస్వతి రవి నాయక్‌కు సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News