Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:42 PM

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

02-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కె. నరసింహ ఐపీఎస్, జిల్లా ఎస్పీ సూర్యాపేట

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ఏ ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్‌ను అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత ప్రతిఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర రోడ్ సేఫ్టీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో జనవరి నెలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని, ఏ ఒక్క కుటుంబం కూడా రోడ్డు ప్రమాదాల కారణంగా తమ ఆప్తులను కోల్పోవద్దనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఆ ప్రణాళిక ప్రకారం జిల్లా పోలీస్ సిబ్బంది గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీ కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, ప్రమాదకర జంక్షన్లు, జనసమూహ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

డిఫెన్సివ్ డ్రైవింగ్, హెల్మెట్‌, సీటుబెల్ట్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపకూడదనే అంశాలు, ‘అరైవ్ సేఫ్ – అలైవ్’ నినాదం ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ కోరారు.

Sthanikam

డిఫెన్సివ్ డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News