Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:05 AM

డైమండ్ జువెల్లర్స్‌లో అరుదైన వజ్ర ప్రదర్శన

18-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గిన్నిస్ రికార్డు పొందిన ఎస్ డబ్ల్యు ఎ వజ్రాన్ని ప్రారంభించిన చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి

పట్టణంలోని డైమండ్ జువెల్లర్స్‌లో గిన్నిస్ రికార్డు పొందిన ఎస్ డబ్ల్యు ఎ వజ్ర ప్రదర్శనను సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేట ప్రజలకు అందుబాటు ధరల్లో బంగారు ఆభరణాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని షోరూం నిర్వాహకులకు సూచించారు. పట్టణ వ్యాపార అభివృద్ధికి ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, జ్యోతి కరుణాకర్, నాగులపాటి వాసు, బైరబోయిన శ్రీనివాస్, ఫరూక్, బండారు పద్మ పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులు తెడ్ల పురుషోత్తం, పొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, రాచకొండ శ్రీనివాస్, సిటీ యూనియన్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. అరుదైన వజ్రాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Sthanikam

డైమండ్ జువెల్లర్స్‌లో అరుదైన వజ్ర ప్రదర్శన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News