Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:54 AM

డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం

16-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహేశ్వరం: మహంకాల్–1 డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి హామీ ఇచ్చారు. తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా దేప భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మహంకాల్–1 పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైనా, హైకోర్టు కేసు కారణంగా గృహ ప్రవేశాలు నిలిచిపోయాయని తెలిపారు. అనంతరం జరిగిన రీ–ఎంక్వైరీలో అర్హులైన 141 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించి జిల్లా కలెక్టర్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు నివేదికలు అందించారని చెప్పారు.

ఇళ్ల కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేయగా, వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ అంశాన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే గృహ ప్రవేశాలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News