Sthanikam - Truth Matters
Logo

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం

Updated : 13 Jan 2026 20:55 IST
As Preferred Source 1 min read
డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల పట్టణంలో 240 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు త్వరలోనే అందిస్తామని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. మంగళవారం రోజున చిట్యాల పట్టణంలోని ఒకటో వార్డును ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివనేనిగూడెం లో ఉన్న డంపింగ్ యార్డ్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ డంపింగ్ యార్డ్ ను జనావాసానికి దూరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. శివనేనిగూడెంలో ఇండ్లు లేని పేద ప్రజలు చాలామంది ఉన్నారని గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో ఒకరి కూడా ఇల్లు ఇవ్వలేకపోయారని , ఈ మార్చి నెలలో 60 ఇందిరమ్మ ఇండ్లు ఒకటో వార్డుకు కేటాయిస్తామని అన్నారు. వీటితోపాటు గ్రామంలో ఉన్న చెరువు పూడిక ను తీస్తామని చిట్యాలలో ఉన్న అన్ని వార్డుల్లో ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, చిట్యాల మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, పోకల దేవదాస్, చిన్న మల్లయ్య,, మారగోని ఆంజనేయులు,, గంగాపురం లింగస్వామి,, మల్లబోయిన మల్లేశం. గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తాం ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి