Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

చౌటుప్పల మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులు పోటీ

31-01-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలి

పదవులు ఆభరణం కాదు పోరాటానికి ఆయుధంగా ఉంటుంది

ఎండీ జాహంగీర్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,జిల్లా కార్యదర్శి

చౌటుప్పల మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ పోటీచేస్తుందని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించగల పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ ప్రజలకు పిలుపునిచ్చారు.చౌటుప్పల మండల కమిటీ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు రాగిరు కిష్టయ్య అధ్యక్షత న జరిగింది. ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడుతూ, రాజకీయం వ్యాపారంగా మారిందని అలాటి డబ్బు రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని నాయకులు ప్రజలను ప్రలోబాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలనే వారి ఎత్తులను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. పదవులు ఆభరణంకాదని అది పోరాటానికి ఆయుధంగా ఉంటుందని, అలాంటి పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే ప్రజలు గెలిపించాలని కోరారు. చౌటుప్పల మున్సిపాల్టిలో నెలకొన్న సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించినఘనత సిపిఎం పార్టీకి ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి,శ్రీనివాస్ చారి,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశం,మండల కార్యదర్శి గంగాదేవి సైదులు,మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి,చింతల సుదర్శన్, బోయ యాదయ్య,మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, అంతటి అశోక్, కొండే శైలం,ఎనమల్ల సంజీవ,మీసాల శీను,కొంతం సుశీల, రోడ్డ సోని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల మున్సిపాలిటీలో సిపిఎం అభ్యర్థులు పోటీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News