Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..

12-02-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అపూర్వ చైతన్యాన్ని ప్రదర్శించారు.పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 91.91 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం.ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కనిపించగా, సాయంత్రం వరకు అదే ఉత్సాహం కొనసాగింది. చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని 20 వార్డుల్లో మొత్తం 25,801 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12,963 మంది మహిళలు,12,838 మంది పురుష ఓటర్లు ఉండగా.. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 11,931 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 11,782 మంది పురుషులు ఓటేశారు. శాతాలవారీగా చూసిన మహిళల పోలింగ్ అధికంగా నమోదవడం గమనార్వం.

కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూలైన్లు కనిపించినా..

ప్రజాస్వామ్యం పట్ల మహిళల నిబద్ధత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పలు కేంద్రాలలో మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పోలింగ్ సజావుగా సాగింది.యువతతో పాటు వృద్ధులు కూడా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో స్వల్ప క్యూ లైన్ లు కనిపించినా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగింది. ఇంత భారీ శాతంలో పోలింగ్ నమోదవడం అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటరు తీర్పు ఎటు మొగ్గు చూపిస్తుందో ఆన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది. చౌటుప్పల్ లో నమోదైన ఈ రికార్డు స్థాయి పోలింగ్ ప్రజాస్వామ్యానికి ప్రజలు ఇచ్చిన గొప్ప మద్దతుగా నిలిచింది.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి పోలింగ్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News