Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

చౌరస్తాల సుందరికరణలో వివక్ష :మున్సిపల్ కమిషనర్‌కు వినపత్రం

24-01-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాల సుందరికరణ కోసం పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల పథకం కింద రూపాయలు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో రాజీవ్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, సేవాలాల్ చౌరస్తా, బసవేశ్వర చౌరస్తాల సుందరికరణ చేపడతామని సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రకటించడంపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఉన్న అంబేద్కర్ చౌరస్తా సుందరికరణను పూర్తిగా విస్మరించడం తీవ్ర అభ్యంతరకరమని బహుజన నాయకులు పేర్కొన్నారు. ఇది కేవలం అంబేద్కర్ పై జరిగిన అవమానమే కాకుండా,యావత్ దళిత సమాజంపై జరిగిన అన్యాయంగా భావిస్తున్నామని తెలిపారు.ఈ వివక్షపూరిత వైఖరిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ నారాయణఖేడ్ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జి అనుముల తుకారం, అంబేద్కర్ భవనం ఇంచార్జి భీమ సేన సిద్ధు, ఎనిమిదవ వార్డు అధ్యక్షులు తుకారం, భీమ్రావు,రాములు,తదితరులు మున్సిపల్ కమిషనర్ కు వినపత్రం అందజేశారు.ఈ వినపత్రంలో అంబేద్కర్ చౌరస్తాను కూడా ఇతర చౌరస్తాల మాదిరిగానే సమానంగా సుందరికరణ చేయాలని,ఎలాంటి వివక్షతకు తావు లేకుండా నిధులను న్యాయంగా వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.

Sthanikam

చౌరస్తాల సుందరికరణలో వివక్ష :మున్సిపల్ కమిషనర్‌కు వినపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News