Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ
10-02-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన బొల్లు వెంకటరెడ్డి (తండ్రి: గోపాల్ రెడ్డి) తన కుమారుడి వివాహ ఖర్చుల నిమిత్తం నాలుగు లక్షల 50 వేల రూపాయలను తీసుకువచ్చి తన ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఉదయం సుమారు 8 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ పనిమీద బయటకు వెళ్లారు.

మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి మెయిన్ డోర్ తాళాన్ని గుర్తు తెలియని దొంగలు ఇనుప రాడ్డు సహాయంతో విరగొట్టి, ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.4,50,000 నగదుతో పాటు రెండు తులాల నర (2½ తులాలు) బంగారు నల్లపూసల గొలుసును దొంగలించి తీసుకెళ్లినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై బొల్లు వెంకటరెడ్డి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నార్కట్పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నార్కట్పల్లి సీఐ కే. నాగరాజుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలను సేకరించారు.

దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Sthanikam

చౌడంపల్లి గ్రామంలో భారీ చోరీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News