Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:38 AM

చిత్తపూరు స్మశాన భూములలో కబ్జాదారును తొలగించి ప్రజలకు స్వాధీనపరచాలి! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్!

11-02-2026 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చిత్తపూరు స్మశాన భూములలో కబ్జాదారును తొలగించి ప్రజలకు స్వాధీనపరచాలి! సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామం ఇందిరా కాలనీ దళితవాడలో అనారోగ్య కారణంగా ఆడమిల్లి సుభద్రమ్మ చనిపోయినారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు భౌతిక కాయానికి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు .ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ. మౌలిక వసతులు లేని గ్రామం ఏదైనా ఉందంటే అది స్మశానంతో సమానం కానీ, చిత్తపూరు గ్రామానికి సుమారు ఆరు ఎకరాల స్మశాన భూమి కలదని స్మశాన భూమి కబ్జాలకు గురైందని స్థానికంగా ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్వో చోద్యం చూస్తున్నారు తప్ప ఆక్రమణలకు గురైన స్మశాన భూమి గుర్తించి ఆక్రమణదారులను తొలగించుటలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. నాలుగు నెలలుగా స్మశాన భూమికి సంబంధిత పత్రాలు సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా నేటికీ ఇవ్వలేదన్నారు.రెవెన్యూ అధికారులు స్వలాభాలకు ఆశపడుతూ ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి కనీస గౌరవ మర్యాదలు కల్పించటలేదని ఆవేదన వ్యక్తం చేశారు.చనిపోయిన భౌతిక కాయాలను సొంత భూములు ఉన్నవారు దహన కార్యక్రమాలు చేసుకుంటున్నారని, ఏ భూమి లేని నిరుపేదలు వాగులు, చెరువులు, గుంటలలో దహన కార్యాలు చేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని, సంబంధిత అధికారులు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు .తక్షణం స్థానిక మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న క్షేత్రస్థాయిలో స్మశాన వాటిక భూములను పరిశీలన చేసి కబ్జాదారులను తొలగించి గ్రామపంచాయతీకి అప్పగించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.అప్పుడే, చనిపోయిన వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో గ్రామంలో ప్రజలను కూడగట్టుకుని సంబంధిత కార్యాలయం వద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలపాల వెంకటేశ్వరరావు, వేముల బక్కయ్య, చాట్ల బాబురావు, పల్లెపాము భవాని ,ఆడమిల్లి వెంకటేశ్వరరావు, అడిమెల్లి యేసు రత్నం , ఆడిమల్లి ముసలయ్య, ఆడమిల్లి చంటి ,అడిమెల్లి మల్లయ్య, అడిమెల్లి నాని, కోపూరి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News