Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

చిట్యాలలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

11-03-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టిన మున్సిపల్ పాలకవర్గం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చిట్యాల పురపాలక సంఘం పరిధిలో ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని 2వ మరియు 9వ వార్డుల్లో విస్తృత స్థాయిలో పారిశుధ్య పనులు నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. సీసీ రోడ్ల పక్కన పిచ్చిగా పెరిగిన కంపచెట్లు, అడవి మొక్కలను తొలగించి వీధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. దోమల నివారణకు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మురుగు కాలువలపై బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణాన్ని ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు, వార్డు కౌన్సిలర్లు షబానా అజీమ్, ఏర్పుల పరమేష్, కుక్కల మోహన్, గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, నిమ్మనగోటి శ్రీనివాస్, నాగిళ్ల సుధాకర్, జెర్రిపోతుల సత్యనారాయణతో పాటు మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News