Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు

23-02-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు తొమ్మిది ఆవులను రక్షించి గోశాలకు తరలించారు.

చిట్యాల పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ ఎదుట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో దగ్గర దగ్గరగా కట్టేసి ఊపిరాడకుండా తొమ్మిది ఆవులను తరలిస్తున్నట్టు గుర్తించారు.ప్రాథమిక విచారణలో ఈ ఆవులను కోదాడ నుంచి హైదరాబాద్ నగరంలోని కళేబరాల మార్కెట్‌కు తీసుకెళ్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అవసరమైన అనుమతులు లేకుండా, జంతు సంక్షేమ నిబంధనలు పాటించకుండా తరలించడం స్పష్టమైందని తెలిపారు.ఈ ఘటనపై వాహన యజమానిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, ఆవులను సంరక్షణ నిమిత్తం సమీప గోశాలకు తరలించినట్టు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.

అక్రమ గోవుల రవాణాపై పోలీసులుకఠినంగావ్యవహరిస్తామని, జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరింత విస్తరించనున్నట్లు పోలీసు వర్గాలు సూచించాయి.

Sthanikam

చిట్యాలలో తొమ్మిది ఆవుల రక్షణ వాహన యజమానిపై కేసు నమోదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News