Sthanikam - Truth Matters
Logo

చిట్యాలలో పెరిగిన ఓటు విలువ పార్టీల పోటీ ఆఫర్లు

Updated : 10 Feb 2026 11:28 IST
As Preferred Source 1 min read
చిట్యాలలో పెరిగిన ఓటు విలువ పార్టీల పోటీ ఆఫర్లు

నల్గొండ : చిట్యాలలో ఓటుకు ‘బంగారు ధర’

పోల్ మేనేజ్‌మెంట్‌లో తగ్గేదెలే..!

చిట్యాల మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రోజురోజుకీ ముదురుతోంది. పోల్ మేనేజ్‌మెంట్ కేంద్రంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. “తగ్గేదేలే” అన్నట్టుగా రెండు పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో ఓటర్లే టార్గెట్‌గా వ్యూహాలు పదునెక్కుతున్నాయి.ఈ ఎన్నికల్లో ఓటుకు మంచి రేటు పలుకుతోందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒక్కో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని, అదే స్థాయిలో పార్టీల అభ్యర్థులు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది.నగదు మాత్రమే కాకుండామందు బాటిల్స్చీరెలుఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లకు రవాణా ఖర్చులుఅన్నీ భరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ ఈ పోటీ తగ్గడం లేదని సమాచారం. ప్రతి ఓటూ కీలకమేనన్న భావనతో అభ్యర్థులు భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎవరు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పోటీగాప్రలోభాలకుపాల్పడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ.మొత్తానికి చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు అభివృద్ధి కంటే ప్రలోభాలే ప్రధాన ఆయుధంగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు విలువ ప్రజాస్వామ్యానికి పునాది అయితే, దానికి ఇంత బారీ ధర కట్టడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Sthanikam

చిట్యాలలో పెరిగిన ఓటు విలువ పార్టీల పోటీ ఆఫర్లు

Article Image

మరిన్ని

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news