Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన
01-04-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కేంద్ర కార్మిక విధానాలపై తీవ్ర నిరసన.. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో చిట్యాలలో నల్ల జెండాలతో కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం అమలు చేయబోతున్న కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు “బ్లాక్ డే”గా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికులు దీర్ఘకాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్ రూపంలో బలహీనపరచడం విచారకరమని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రదర్శనలో కార్మికులు నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాలపైభారంగామారుతున్నాయని నాయకులు విమర్శించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, గుడిసె లక్ష్మీనారాయణతో పాటు సిఐటియు నాయకులు పాల లక్ష్మయ్య, జనపాల జ్యోతి, మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, ఎం.డి. అఫ్జల్, జడల నర్సింహా, బాకీ అండాలు, ధనలక్ష్మి, యమున, జిట్ట నరేష్, ఏళ్ల మారయ్య, బండారు శంకరయ్య, దూడెల యాదయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

Sthanikam

చిట్యాలలో నల్ల జెండాలతో సిఐటియు ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News