Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

చిట్యాలలొ మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

10-02-2026 256 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

24 పోలింగ్ కేంద్రాలు కట్టుదిట్టమైన భద్రత

జడ్.పి.హెచ్.ఎస్‌లో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మొత్తం 12,118 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 120 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 24 మంది రిసీడింగ్ అధికారులు, 24 మంది అసిస్టెంట్ రిసీడింగ్ అధికారులు, మిగిలిన 72 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. మంగళవారం రోజున స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని స్వీకరించిన సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.ఓటర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా స్థానిక జడ్.పి.హెచ్.ఎస్‌లో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌ను ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ, సిబ్బంది హాజరు, భద్రతా ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించి ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత: సీఐ నాగరాజు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 పోలింగ్ కేంద్రాల్లో 13 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక డీఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 75 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని ఆయన వివరించారు.

పోలింగ్ సామాగ్రిని సురక్షితంగా కేంద్రాలకు చేరవేశామని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకున్నామని సీఐ నాగరాజు స్పష్టం చేశారు.

Sthanikam

చిట్యాలలొ మున్సిపల్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News