Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు
03-04-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికుల అప్రమత్తతతో ఇద్దరు పట్టివేత – మరొకరు పరార్

చిట్యాల: మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ దొంగతనాలతో భయాందోళన సృష్టించిన ముఠా ఎట్టకేలకు స్థానికుల చేతికి చిక్కింది. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రజలు ఇద్దరు దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించగా, మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం.గత వారం రోజులుగా చిట్యాల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు యథేచ్ఛగా మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 30న పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, దర్యాప్తు కొనసాగుతుండగానే ముఠా మరోసారి దొంగతనానికి పాల్పడింది. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి మొబైల్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన సమయంలో అనుమానం వచ్చిన స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న పోలీసులు, ఈ ముఠా చిట్యాలకే పరిమితమా? లేక జిల్లా వ్యాప్తంగా దొంగతనాల్లో పాలుపంచుకున్నదా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

చిట్యాలలో మొబైల్ దొంగల ముఠా బట్టబయలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News