Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం

చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం

చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం
15-03-2026 625 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వరుసగా వాహనాల బ్యాటరీలు చోరీకి గురవడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే రాత్రిలో రెండు వాహనాల బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

స్థానికంగా నివసిస్తున్న కొమిడాల మహేందర్ రెడ్డి తన రోజువారీ పనులు ముగించుకొని శనివారం రాత్రి చిట్యాల–భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఖాళీ స్థలంలో తన వాహనాన్ని పార్క్ చేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం అక్కడికి వచ్చి చూసేసరికి వాహనంలో ఉన్న బ్యాటరీ కనిపించకుండా పోయిందని ఆయన తెలిపారు.

ఇదే రోడ్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఇంటి ముందు ఉన్న మరో ట్రాక్టర్ బ్యాటరీని కూడా అదే రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా రెండు చోట్ల చోరీలు జరగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

ఈ ఘటనపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల రాత్రి వేళల్లో పెరుగుతున్న చోరీలపై పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

చిట్యాలలో బ్యాటరీల చోరీ కలకలం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News