Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

చిట్యాల రైతుల డిమాండ్‌: ఎన్‌హెచ్-65పై కూరగాయల, పండ్ల మార్కెట్ సముదాయం నిర్మించాలి

20-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలమండలంలోని రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా కూరగాయలు, పండ్ల విక్రయాల కోసం ఆధునిక దుకాణాల సముదాయం (భవనం) నిర్మించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చిట్యాల రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ కార్యదర్శి జానయ్యకు వినతిపత్రం అందజేశారు.

జాతీయ రహదారి 65 (విజయవాడ–హైదరాబాద్ మార్గం) పక్కన ఈ సముదాయాన్ని ఏర్పాటు చేస్తే రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. మధ్యవర్తుల సమస్య తగ్గి, రైతులకు మెరుగైన ధర లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల రైతు సంఘం నాయకులు రైతుల సమస్యలను వివరించారు. ప్రాంతీయంగా పండ్ల, కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ సరైన మార్కెట్ సదుపాయాల లేమితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రైతుల అభ్యర్థనపై స్పందించిన అధికారులు ప్రతిపాదనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Sthanikam

చిట్యాల రైతుల డిమాండ్‌: ఎన్‌హెచ్-65పై కూరగాయల, పండ్ల మార్కెట్ సముదాయం నిర్మించాలి

Article Image

చిట్యాలమండలంలోని రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా కూరగాయలు, పండ్ల విక్రయాల కోసం ఆధునిక దుకాణాల సముదాయం (భవనం) నిర్మించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చిట్యాల రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ కార్యదర్శి జానయ్యకు వినతిపత్రం అందజేశారు.

జాతీయ రహదారి 65 (విజయవాడ–హైదరాబాద్ మార్గం) పక్కన ఈ సముదాయాన్ని ఏర్పాటు చేస్తే రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. మధ్యవర్తుల సమస్య తగ్గి, రైతులకు మెరుగైన ధర లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల రైతు సంఘం నాయకులు రైతుల సమస్యలను వివరించారు. ప్రాంతీయంగా పండ్ల, కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ సరైన మార్కెట్ సదుపాయాల లేమితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.రైతుల అభ్యర్థనపై స్పందించిన అధికారులు ప్రతిపాదనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News