Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

24-02-2026 417 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రతినిధులు ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొని సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.సంఘ గౌరవ అధ్యక్షులుగా ఏనుగు అంజిరెడ్డి, సంఘ అధ్యక్షులుగా కోమటిరెడ్డి రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చొప్పరి మల్లేశం, గుమ్మి నర్సిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కార్యదర్శిగా జిట్ట బొందయ్య, సహాయ కార్యదర్శులుగా ఆగు వెంకన్న, బూడిద లింగస్వామి ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా నారబోయిన శ్రీనివాస్, జిట్ట రాజయ్య, విట్టల్ రెడ్డి, చిర్రబోయిన నరసింహ, కొంతం సత్తిరెడ్డి, ఏర్పుల స్వామి, రేముడాల యాదయ్య, ఆగు నరసింహ, వరకాంతం నరేందర్ రెడ్డి, ఎడ్ల మాలింగం, రేముడాల శ్రీశైలం, నల్ల మహేందర్ రెడ్డి, రావుల మల్లారెడ్డి, చిర్రబోయిన రమేష్ లను ప్రతినిధులు ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం రైతుల సమస్యల పరిష్కారం, సాగు నీటి వసతులు, పంటలకు కనీస మద్దతు ధర సాధన వంటి అంశాలపై సమిష్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చింది. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

Sthanikam

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News