Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు

30-01-2026 359 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

12 వార్డులకు 73 మంది అభ్యర్థుల నుంచి 106 నామినేషన్లు.

నల్గొండ జిల్లా చిట్యాల. మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మొత్తం 12 వార్డులకు గాను 73 మందిఅభ్యర్థులు 106 నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

నామినేషన్ల స్వీకరణలో భాగంగా మొదటి రోజు 9, రెండో రోజు 44, మూడో రోజు 73 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో అత్యధికంగా 15 నామినేషన్లు దాఖలవగా, 12వ వార్డులో అత్యల్పంగా 6 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. రెండో, మూడో వార్డుల్లో తలా 9, నాలుగో, ఐదో వార్డుల్లో తలా 7, ఆరో వార్డులో 8, ఏడో వార్డులో 10, ఎనిమిదో, తొమ్మిదో, పదకొండో వార్డుల్లో తలా 8, పదో వార్డులో 11 నామినేషన్లు దాఖలయ్యాయి.పార్టీల వారీగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 34 నామినేషన్లు దాఖలవగా, బిఆర్ఎస్ నుంచి 33, బీజేపీ నుంచి 15, ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్ర అభ్యర్థులుగా 7, బీఎస్పీ నుంచి 3, సీపీఐ నుంచి 3 నామినేషన్లు వచ్చాయి.దాఖలైన నామినేషన్లపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఆదివారం (1వ తేదీ) సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన చేపడతామని, నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందని కమిషనర్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం ముగింపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News