Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుతో ఆశావాహులు నిరాశ

29-01-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 12 మంది అభ్యర్థులను ఖరారు చేయడంతో టికెట్ ఆశించిన పలువురు ఆశావాహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తమకు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఒక్కసారిగా అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో, టికెట్ ఆశించిన నాయకులు షాక్‌కు గురైనట్లు సమాచారం. పార్టీ కోసం సంవత్సరాలుగా సేవలందించిన వారిని పక్కనబెట్టి కొందరికి మాత్రమే అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్గత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

టికెట్ దక్కని కొందరు నేతలు పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మౌనంగా ఉండిపోయారు. ఈ పరిణామాలు చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసంతృప్త నేతలను పార్టీ ఎలా సమన్వయం చేస్తుందన్నది, రానున్న మున్సిపల్ ఎన్నికలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుతో ఆశావాహులు నిరాశ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News