Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

03-02-2026 303 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పోటీ చిత్రపటం స్పష్టమైంది. మొత్తం 12 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.

పార్టీల వారీగా పరిశీలిస్తే భారత రాష్ట్ర సమితి నుంచి అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి తలా 11 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 6 మంది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నుంచి 3 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

వార్డుల వారీగా చూస్తే మొదటి వార్డులో 6 మంది, రెండో మరియు మూడో వార్డుల్లో తలా 4 మంది, నాలుగో, ఐదో, ఆరవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏడవ, ఎనిమిదో, తొమ్మిదో వార్డుల్లో తలా 5 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పదో వార్డులో 2 మంది, పదకొండవ మరియు పన్నెండవ వార్డుల్లో తలా 3 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల బరిలో 46 మంది అభ్యర్థులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News