Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత రమేష్ ప్రమాణ స్వీకారం

16-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.చైర్మన్‌గా పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్‌గా గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు స్థానిక అధికారుల సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ, పట్టణ సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుత పాలన అందించేందుకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.

వైస్ చైర్మన్ గుండబోయిన శ్రీలక్ష్మి సైదులు మాట్లాడుతూ, ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, మహిళల సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.కార్యక్రమం ముగింపులో పలువురు నాయకులు నూతన పాలకవర్గాన్ని అభినందిస్తూ, చిట్యాల పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Sthanikam

చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత రమేష్ ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News