Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:36 PM

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు
30-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాబోయే చిట్యాల మునిసిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పూర్తి స్థాయిలో పోటీకి దిగింది. మునిసిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు గాను 12 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసి బరిలోకి దించింది. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థులుగా

1వ వార్డులో రుద్రవరం లింగస్వామి,

2వ వార్డులో గుండాల పవిత్ర నరేష్,

3వ వార్డులో పాల శ్రీలత రాకేష్,

4వ వార్డులో ఉద్రతీ నాగరాజు,

5వ వార్డులో ఈడుదుల నర్సమ్మ,

6వ వార్డులో గంజి గోవర్ధన్,

7వ వార్డులో పాల లక్షమామ్మ,

8వ వార్డులో కన్నె బోయన మహాలింగం,

9వ వార్డులో కూరెళ్ల శ్రీను,

10వ వార్డులో కునూరు సంజయ్ దాస్,

11వ వార్డులో ధుడ్డు భాగ్యమ్మ,

12వ వార్డులో సుంచు అశ్విని శ్రీను బరిలో నిలిచారు.

పార్టీ జిల్లా నాయకత్వం అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించగా, ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ప్రతి వార్డులో స్థానిక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై స్పష్టమైన హామీలతో ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు అభ్యర్థులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల పోటీతో చిట్యాల రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Sthanikam

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News