Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:27 AM

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

16-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేతేపల్లి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు. కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలో వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి సీనియర్ నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ గ్రామాల్లో పంచాయితీలు, కుటుంబ వివాదాల్లో మధ్యవర్తిత్వం చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. మరోసారి చిరుమర్తి లింగయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.

చీకటిగూడెం ఘటనపై అవాస్తవాలు ప్రచారం

చీకటిగూడెం గ్రామ ఘర్షణ విషయంలో కంపసాటి శ్రీనివాస్ యాదవ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బాధితుడు ఆల్దాస్ సతీష్ భార్య మంజుల ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో జరిగిన వివాదాన్ని రాజకీయ కక్షతో మలిచారని తెలిపారు.

తమ కుటుంబానికి ఎటువంటి భూములు లేవని, వరి పంట కూడా వేయలేదని చెప్పారు. గతంలో కూడా అక్రమ కేసులు పెట్టించి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

ఘర్షణ కేసులో పరారీలో ఉన్న ఉప్పుల శివ, మైనం మహేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

విలేకరుల సమావేశంలో కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బంటు మహేందర్, కొండ సైదులు, కొండేటి రెడ్డి, నల్లపు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిరుమర్తి లింగయ్యపై విమర్శలు తగవు కంపసాటి శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News