చిన్నారులకు ఆశీర్వాదాలు అందించిన కాంగ్రెస్ నాయకులు
చిన్నారులకు ఆశీర్వాదాలు అందించిన కాంగ్రెస్ నాయకులు
Biksham
సూర్యాపేటలో ఘనంగా హఖిక, నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం
సూర్యాపేట పట్టణంలోని జె ఫంక్షన్ హాల్‌లో యండ్లపల్లి గ్రామానికి చెందిన షేక్ సైదా కుమారుని హఖిక, కుమార్తె నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట్ల వెంకట నాగిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ దాసరి తిరుమల్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజాద్ అలి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ చింతమళ్ల రమేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, గుణగంటి హేమ సతీష్, రాపర్తి భవాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వెన్న మధుకర్ రెడ్డి, మద్దెబోయిన శ్రీనివాస్, గడ్డం వెంకన్న, పడిదల రవి, అన్నమయ్య రాము, బొప్పాని శ్రీకాంత్, బొప్పాని లలిత్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి