Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం
08-04-2026 229 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గడువు దాటిన పానీయాలు, నకిలీ నీటిబాటిళ్లు.. భక్తుల ఆరోగ్యంపై ఆటలు

చెరువుగట్టు: పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల విశ్వాసాన్ని డబ్బుగా మార్చుకుంటూ, వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఓ కూల్ డ్రింక్ దుకాణంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆలయ ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆహార భద్రత విభాగం అధికారులు గురువారం సడెన్ తనిఖీలు నిర్వహించి షాప్‌ను సీజ్ చేశారు.

తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. దుకాణంలో గడువు ముగిసిన పానీయాలు భారీగా నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్టు తేలింది. ఆలయానికి వచ్చే భక్తులు అధికంగా ఈ దుకాణంపైనే ఆధారపడటాన్ని ఆసరాగా చేసుకుని, నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడేలా వ్యవహరించిన దుకాణదారుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్‌కు పంపించి పూర్తి నివేదిక రాగానే మరింత చర్యలు ఉంటాయని ఆహార భద్రత అధికారులు స్పష్టం చేశారు.ఈ ఘటనతో చెరువుగట్టుకు వచ్చే భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ పరిసరాల్లో విక్రయించే ఆహార పదార్థాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

చెరువుగట్టుపై ‘కూల్ డ్రింక్’ కుంభకోణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News