Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:20 PM

చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు

చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు

చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు
25-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ముసునూరు:గ్రామ అవసరాల కోసం తరాల నాడు తవ్వించి ఇచ్చిన పేదల చెరువు ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో 200 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దాత నాగళ్ళ రామయ్య గ్రామ అవసరాల కోసం తన సొంత నిధులతో చెరువు తవ్వించి దానంగా ఇచ్చాడు. నాటి నుంచి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు మంచినీటి అవసరాలకుచెరువునువాడుకుంటున్నారు. కాల క్రమేణా గ్రామంలో మంచినీటికి బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, బోర్లు, మోటార్లు అందుబాటులోకి రావడంతో, చెరువును పశువుల దాహార్తిని తీర్చేందుకు వాడు తున్నారు.కాగా ఏడాదిన్నర క్రితం నుంచి దాతకు ఏ మాత్రం సంబంధం లేని అధికార పార్టీకి చెందిన కొందరు పని గట్టుకొని చెరువును ఆక్రమించే పనిలో పడ్డారు. తమకు పట్టాలు ఉన్నాయని, ఆన్ లైన్ లో నమోదైనాయని చెబుతూ కబ్జాకు దిగారు.దీనిపై గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి జిల్లా కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్, ముసునూరు తహసీల్దార్ కు అర్జీలు అందించి పరిష్కారం కోరారు.ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కబ్జా దారులు మూడు జేసీబీలు, నాలుగు బుల్డోజర్లతో కట్టను తవ్వించారు.ఆ మట్టి, గ్రావెల్ తో చెరువును పూడ్చడం ఆరంభించడంతో గ్రామస్తులంతా కలిసి అడ్డుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి పేదల చెరువును గ్రామ అవసరాల కోసం యథాతథంగా ఉంచాలని పేదలు కోరుతున్నారు.

Sthanikam

చెరువు కబ్జా....గగ్గోలు పెడుతున్న పేదలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News