Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:55 AM

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి

15-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన రైతు పుట్టప్ప పొలం పనులకు ఎద్దుల బండిపై వెళ్తుండగా, మడకశిర వెళ్లే మార్గంలో పెనుకొండ వైపు నుంచి వచ్చిన లారీ ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రైతు పుట్టప్పకు తీవ్ర గాయాలు కాగా ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో రెండు ఎద్దులు గాయపడగా, ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది.

ఎద్దులు మరియు బండికి కలిపి సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

చెరుకూరు గ్రామంలో ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ తీవ్ర గాయాలతో రైతు అపస్మారక స్థితి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన రైతు పుట్టప్ప పొలం పనులకు ఎద్దుల బండిపై వెళ్తుండగా, మడకశిర వెళ్లే మార్గంలో పెనుకొండ వైపు నుంచి వచ్చిన లారీ ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రైతు పుట్టప్పకు తీవ్ర గాయాలు కాగా ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో రెండు ఎద్దులు గాయపడగా, ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది.

ఎద్దులు మరియు బండికి కలిపి సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News