Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:13 AM

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు

06-02-2026 404 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

బిజెపి పార్టీ 13వ వార్డు కౌన్సిలర్

అభ్యర్థి చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి కీలక మలుపుగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 13వ వార్డులో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి స్వాతి గురువారం ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా రామ్ నగర్ లో ప్రారంభమైన ర్యాలీ, కృష్ణానగర్ మీదుగా సర్వీస్ రోడ్డు వెంట పద్మశాలి కాలనీ వరకు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. అభ్యర్థితో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, యువత నుంచి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న యువతకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే చెరుకు స్వాతి శివ గౌడ్ కు అవకాశం ఇచ్చామన్నారు. వార్డు ప్రజలు ఆదరించిఆశీర్వదించాలని కోరారు. 13వ వార్డు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, వార్డు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందన్నారు. బిజెపి అభ్యర్థి చెరుకు స్వాతి శివ గౌడ్ ను గెలిపించుకుంటే వార్డు స్వరూపం మారుతుందన్నారు. వార్డు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి చెరుకు స్వాతి శివ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, బీజేవైఎం నాయకులు దిండు భాస్కర్, పబ్బు వంశీ, నాయకులు మార్గం స్వామి యాదవ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చెరుకు స్వాతి శివ గౌడ్ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News