Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన

01-04-2026 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో గురువారం ఉదయం 10 గంటలకు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ వార్డు సభల్లో ప్రజలకు సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల గురించి వివరించబడుతుంది.

అదేవిధంగా ప్రతి వార్డులోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు సంబంధిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించబడతాయి. చౌటుప్పల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు వార్డుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి కోరారు.

Sthanikam

చౌటుప్పల్‌లో వార్డు సభలు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”పై అవగాహన

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో గురువారం ఉదయం 10 గంటలకు “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ వార్డు సభల్లో ప్రజలకు సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల గురించి వివరించబడుతుంది.

అదేవిధంగా ప్రతి వార్డులోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు సంబంధిత వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన నిర్వహించబడతాయి. చౌటుప్పల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు వార్డుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News