Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

చౌటుప్పల్‌లో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

29-03-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్టీఆర్‌కు నివాళులు.. కేక్ కట్ చేసి సంబరాలు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ చేసి, వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గం మాజీ కోఆర్డినేటర్, మండల టిడిపి అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ, 1983 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందిందన్నారు. కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు.బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీగా టిడిపి నిలిచిందన్నారు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైనా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ మరింత బలపడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో కూడా టిడిపి కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు సుంకరి జంగయ్య గౌడ్, ప్రచార కార్యదర్శి పాశం రఘుపతి, టీఎన్టీసీ అధ్యక్షుడు బొంగు బాదుషా, మున్సిపల్ ఉపాధ్యక్షుడు తలుపునురి శీను గౌడ్, గోశిక పాండు, చెరుకు అశోక్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల శంకరయ్య, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, నూనె వెంకటేశం, కందగట్ల హరికృష్ణ, సంజీవ, సీతయ్య, సిగుళ్ల ఐలయ్య, గుర్రం యాదగిరి, నరసింహ, అంతటి కిష్టయ్య, బుడుగు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News