Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:18 AM

చౌటుప్పల్లో ప్రైవేట్ ఫైనాన్స్‌ల ఆగడాలు

చౌటుప్పల్లో ప్రైవేట్ ఫైనాన్స్‌ల ఆగడాలు

చౌటుప్పల్లో ప్రైవేట్ ఫైనాన్స్‌ల ఆగడాలు
22-02-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజల ప్రాణాలతో చెలగాటం – బాధితుల ఆవేదన

అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. డబ్బు అవసరమైన ప్రజలను గుర్తించి “ఎలాంటి సివిల్ వివరాలు అవసరం లేదు, డాక్యుమెంటేషన్ అవసరం లేదు” అంటూ టు-వీలర్ ఫైనాన్స్ పేరుతో ఆశ చూపించి అమాయకులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నిబంధనలకు విరుద్ధంగాకార్యకలాపాలు

రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మార్గదర్శకాలు, స్థానిక మున్సిపాలిటీ, పోలీస్ అనుమతులు లేకుండానే కొంతమంది ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధిక వడ్డీలు వసూలు చేయడం, రెండు మూడు ఈఎంఐలు ఆలస్యం అయితే అక్రమంగా వాహనాలను సీజ్ చేయడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా పబ్లిక్ ఆక్షన్ లేకుండా విక్రయించడం వంటి చర్యలు బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.కస్టమర్లకు చట్టపరమైన సమస్యలు విక్రయించిన వాహనాలను కొత్త యజమానుల పేర్లకు మార్చకుండా పాత కస్టమర్ల పేర్లతోనే కొనసాగించడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ కారణంగా కొత్త కొనుగోలుదారులు కూడా ఇరుక్కుపోతున్నారు.అవగాహన లేమితో పెరుగుతున్న దౌర్జన్యాలు స్థానిక ప్రజల్లో చాలామంది నిరక్షరాస్యులు కావడం, చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని సామాజిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల జోక్యం కోరుతూ…ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అంశాన్ని రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి, అక్రమంగా నడుస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ అక్రమ ఫైనాన్స్ వ్యవహారాలపై అధికారుల చర్యలు ఎప్పుడు?

Sthanikam

చౌటుప్పల్లో ప్రైవేట్ ఫైనాన్స్‌ల ఆగడాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News